లక్కీ భాస్కర్ ట్రైలర్ రిలీజ్

Lucky Baskhar 𝐓𝐑𝐀𝐈𝐋𝐄𝐑 𝐎𝐔𝐓 now

సీతారామం తో తెలుగులోకిఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ కొట్టాడు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.ఈసినిమాతో దుల్కర్ కు తెలుగులోకూడా ఫాలోయింగ్ వచ్చింది.ఇక ఈసినిమా తరువాత తెలుగు లో హీరోగా నటించిన సెకండ్ మూవీ లక్కీ భాస్కర్.సార్ ఫేమ్ వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చూన్ ఫోర్ సినిమాస్,శ్రీకరా స్టూడియోస్ నిర్మించాయి.ఈ దీపావళికి వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాంతో ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా వుంది టీం.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను కూడా విడుదలచేశారు. ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది.ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.ఫ్యామిలీ ను కాపాడుకోవడానికి అలాగే గౌరవంగా బ్రతకడానికి ఓ సామాన్య బ్యాంకు ఉద్యోగి ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఈసినిమా.ట్రైలర్ చూస్తుంటే పక్కా హిట్ బొమ్మలాగే అనిపిస్తుంది. 

ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.అయితే ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.దీపావళికి ఈసినిమాతో పాటు కిరణ్ అబ్బవరం క ,శివ కార్తికేయన్- సాయి పల్లవి ల అమరన్ అలాగే కన్నడ డబ్బింగ్ సినిమా బఘీర విడుదలవుతున్నాయి.దాంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ ఫైట్ మొదలవ్వనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.