తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్ సంచలనం సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. ఇప్పటివరకూ విడుదలైన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దసరా కానుకగా పొట్టేల్ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా బ్యాక్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా ఉండగా, లీడ్ క్యారెక్టర్స్ యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, వారి పాప, పొట్టేల్ కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంది.
కాగా పొట్టేల్ సినిమా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నైజాం పంపిణీ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకుంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాం ఏరియాలో రిలీజ్ చేయనుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కాగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే పొట్టేల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: