రేపు బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్న ప్రశాంత్ వర్మ

HanuMan Director Prasanth Varma to Give Big Update Tomorrow

‘హనుమాన్’ సినిమాతో ఓవర్ నైట్‌లో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై 100 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనికి ఇతిహాసాల నేపథ్యం జోడించడం ప్రేక్షకులను అబ్బురపరిచింది. దీంతో ప్రశాంత్ తదుపరి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ విజయంతో దీనికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రశాంత్ పూనుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.

అయితే ఒకవైపు ఇదిలా కొనసాగుతుండగానే మరోవైపు ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫ్యాన్స్‌కు పూనకాలు కలిగించే అప్‌డేట్‌ ఇచ్చి బిగ్ సర్‌ప్రైజ్ చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు తారక రామ మోక్షజ్ఞ తేజను ఈ సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేయించనున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ క్రేజీ ప్రాజెక్టును సెప్టెంబర్ 6న లాంఛనంగా ప్రకటించిన సంగతి గుర్తుండేవుంటుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ రేపు బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఒక హింట్ ఇచ్చారు. “ఏమైనా ఊహించగలరా?” అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఏమై ఉంటుందా? అని అభిమానులు దీని గురించి తెగ చర్చించుకుంటున్నారు.

కాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌)లో భాగంగా రూపొందుతుండటం గమనార్హం. విశేషమేంటంటే.. ఇందులో బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

SLV సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతోన్న ఈ సినిమాను బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని సమర్పణలో నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక పీవీసీయూతో మోక్షజ్ఞ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుండటంతో, ఇంకా మొదలుకాకముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.