యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ ఇది – గుణశేఖర్

Director Gunasekhar Reveals Interesting Facts About His Movie Euphoria

వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ.. “యుఫోరియా గ్లింప్స్‌ను లాంచ్ చేసిన దిల్ రాజు గారు, దాము గారికి థాంక్స్. అంతా కొత్త వారితో ఈ చిత్రం చేశాను. తొంభై శాతం అంతా కొత్త వాళ్లే కనిపిస్తారు. కథను బేస్‌గా చేసుకుని ఈ ఫిల్మ్ చేశాను. ఏడాదిన్నర క్రితం ప్రాజెక్ట్ అనుకున్నాం. ఆరు నెలలు ప్రీ ప్రొడక్షన్ చేశాం. వీళ్లందరినీ ఆడిషన్స్ చేసి.. వర్క్ షాపులు చేసి షూటింగ్‌కు వెళ్లాం. ఇప్పటి వరకు అరవై శాతం షూట్ పూర్తయింది. యుఫోరియా అంటే ఏంటి? అనేది జనాలకు పరిచయం చేయడానికి ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశాం” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఇలాంటి కథను చెప్పాలని అనిపించింది. కథను రాస్తున్న కొద్దీ.. సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వచ్చాయి. ఈ కథ అనుకున్న తరువాత నీలిమకు చెప్పాను. ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని నా కూతురు చెప్పింది. యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ అని అన్నారు. వాళ్లు కూడా ఇన్ పుట్స్ ఇచ్చారు. పాత్రలకు ఎవరు సూట్ అవుతారో వారినే తీసుకున్నాం” అని చెప్పారు.

అలాగే, నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి వివరిస్తూ.. “కొత్తవారే అయినా కూడా వారు కథకు కనెక్ట్ అయ్యారు. వారి వారి పాత్రల్లో జీవించేశారు. సినిమాటిక్‌‌గా కాకుండా అందరూ రియలిస్టిక్‌గా నటించారు. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పుడున్న యూత్ మైండ్ సెట్‌కు తగ్గట్టుగా సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. మంచి కంటెంట్‌తో వస్తే స్టార్ హీరో ఉన్నాడా? ఏ భాషలో వచ్చింది? అనేది ఆడియెన్స్ చూడటం లేదు. కథ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది” అని అన్నారు డైరెక్టర్ గుణశేఖర్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.