స్టార్ట్ హీరో సూర్య రిలీజ్ తో సంబంధం లేకుండా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు.అందులో భాగంగా కంగువాను పూర్తి చేసి రీసెంట్ గా తన 44వ సినిమా ను స్టార్ట్ చేశాడు. జూలై లో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లగా నిన్నటి తో షూటింగ్ కంప్లీట్ అయ్యింది.కేవలం నాలుగు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు.కేవలం ఇండియాలోనే డిఫ్రెంట్ లొకేషన్లలో షూట్ చేశారు.ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య ఈసినిమాలో గ్యాంగ్ స్టర్ గా న్యూ లుక్ లో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.త్వరలోనే టైటిల్ తోపాటు ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇవ్వనున్నారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈసినిమా కన్నా ముందు సూర్య,కంగువాతోప్రేక్షకులను పలకరించనున్నాడు.ఈసినిమాపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.నవంబర్ 14న రిలీజ్ కానుంది.శివ ఈసినిమాను తెరక్కిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్,స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























