మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమానుండి ఇప్పటివరకూ రిలీజైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. మరోవైపు ప్రీ సేల్స్‌లో ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం జోరు చూపిస్తోంది. దీంతో దేవరపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరూ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవరపై సెప్టెంబర్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సన్నిహితుడు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ దేవర చిత్రం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చాలా గ్యాప్ తర్వాత తారక్ అన్న మంచి ఎమోషనల్ మాస్ కంటెంట్‌తో వస్తున్నారని, సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే ఈ సందర్భంగా అభిమానులందరూ బాధ్యతగా ప్రశాంతంగా ఉండాలని, అనవసరమైన ఫ్యాన్ వార్‌లను సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం నాగవంశీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే.. “తారక్ అన్న చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ మాస్ కంటెంట్ తో వస్తున్నారు. చాలా మంచి కంటెంట్‌ని అందించి తన వంతు కృషి చేశారు. మా వైపు నుండి, మా ప్రియమైన ప్రభుత్వం సహాయంతో, చాలా కాలం తర్వాత APలో బెనిఫిట్ షోలతో పాటు, లభ్యత మరియు అవకాశం ప్రకారం మీకు విస్తృతంగా విడుదల చేయడానికి మేము చేయగలిగినదంతా చేసాము.”
“మా హృదయపూర్వక అభ్యర్థన, మీరు కూడా బాధ్యతగా ప్రశాంతంగా ఉండండి. ఈ అనవసరమైన ఫ్యాన్ వార్‌లను సృష్టించడం ఆపండి. దీని కారణంగా మేము మా సినిమాపై ప్రతికూలత ఎదుర్కొంటాం. అయితే అది కొంత తాత్కాలిక కిక్ ఇవ్వవచ్చు, కానీ తరువాత అది మన హీరోల చిత్రాలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. కాబట్టి మా సహ-అభిమానులందరినీ అభ్యర్థిస్తున్నాము, దయచేసి ఈ అభిమానుల యుద్ధాలను ఆపివేసి, ఈ ఆనందాన్ని ఆస్వాదిద్దాం.”
“ఈ ఫిల్మ్ తో అయినా సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్‌లను ఆపాలని, మన సినిమాలపై నెగిటివిటీని స్ప్రెడ్ చేయవద్దని ప్రతిజ్ఞ చేద్దాం. అంతేకాదు, ఫస్ట్ స్క్రీనింగ్‌లో సినిమా చూస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం మానేయండి మరియు మీ పక్కన కూర్చున్న వారిని కూడా వీడియోలు తీయనివ్వవద్దు. ఆ తర్వాత సినిమా చూస్తున్న అభిమానులకు కూడా ఆ థ్రిల్ కలుగుతుంది. ఎంతో ప్రేమతో, శ్రద్ధతో తారక్ అన్నకు మరపురాని బ్లాక్‌బస్టర్‌ని అందిద్దాం. ఇది మనందరికీ భారీగా ఉంటుంది! దేవర సెప్పిండు అంటే సేసినట్టే.”
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























