మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ ‘దేవర’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
- దేవర సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఉండే ఎగ్జయిట్‌మెంటో, నెర్వస్నెస్ ఏదైనా అనుకోవచ్చు.. మనసులో అలా ఉంది. ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు ఉండేదే.
- దేవర మూవీ కథ అంతా ఫిక్షనల్. ఎక్కడా నిజ ఘటనలను ఆధారంగా చేసుకోలేదు.
- మనిషికి మితిమీరిన ధైర్యం కూడా కరెక్ట్ కాదు. అది మూర్ఖత్వం అవుతుంది.
- మనకు తెలియకుండానే మనలో ఓ భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలని చెప్పటమే ‘దేవర’ కథ.
- భయం లేకుండా ఉండాలనుకోవటం తప్పు. లా ఆఫ్ ల్యాండ్ అనేది ఒకటి ఉంటుంది కదా. దాన్ని అందరూ పాటించాలి. అదే భయం అంటే.
- ఉదాహరణకు ట్రాఫిక్ దగ్గర రెడ్ సిగ్నల్ పడగానే అందరం ఆగుతాం. ఎందుకు ఆగాలి.. వెళ్లిపోవచ్చు కదా అనుకోవచ్చు.
- కానీ మనలో ఆగాలనే చిన్నపాటి భయం ఉంటుందిగా. అందుకే ఆగుతాం.
- అలాంటి భయం మనిషికి ఎంతో అవసరం.. మంచిది కూడా. అదే నేను ‘దేవర’ సినిమాలో చెప్పాను.
- జవాబుదారీతనం కూడా ఓ భయమే. ఇలాంటి భయం ఉండటం వల్ల మనం చేసే పనిని చెక్ చేసుకుని మంచి రిజల్ట్ పొందుతాం.
- ఎన్టీఆర్ గారితో జర్నీ ఎప్పుడూ నాకు స్పెషలే.
- ఏ విషయం అయినా ఆయనతో డిస్కస్ చేసినప్పుడు బాగున్నా, బాగోలేకపోయినా డిప్లొమెటిక్గా సమాధానం చెప్పరు.
- ఓపెన్‌గా మనసులో ఉన్న భావాన్ని చెబుతారు.
- దేవర లైన్ చెప్పినప్పుడు ఆయన స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.
- దేవర సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికే 6 నెలలు సమయం తీసుకున్నాం.
- సముద్రంపై ఎలా షూట్ చేయాలి.. అక్కడ లైటింగ్ వేరియేషన్స్ ఉంటాయి.
- మనం సముద్రాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి.. దాన్నెలా చేయాలనే అంశాలపై స్టడీ చేశాం.
- ఎందుకంటే ఇలా షూటింగ్ ఎవరూ చేయకపోవటం వల్ల మనకు సలహాలిచ్చేవాళ్లు లేరు. అందుకనే సమయం తీసకున్నాం.
- మన టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా టాలెంటెడ్. మనవాళ్లు ప్రిపరేషన్ లేకుండా వెళ్లినా ఎగ్జిక్యూట్ చేయగలరు.
- హాలీవుడ్ టెక్నీషియన్స్ అలా కాదు. వాళ్లు ప్రిపేర్ కాకపోతే భయపడిపోతారు. ప్రతీ సన్నివేశాన్ని రిహార్సల్స్ చేసుకుని వెళతారు.
- అదే లాస్ట్ మినిట్ టెన్షన్లోనూ పని చేయటం మన వాళ్లకు అలవాటే.
- అదే మన వాళ్లకు హాలీవుడ్ టెక్నీషియన్స్ తరహాలో ప్రిపరేషన్ టైమ్ ఇస్తే.. ఇంకా అద్భుతాలు చేస్తారు.
- ఆచార్య సినిమా రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే దానికి ఒత్తిడేం పడలేదు.
- ఈ సినిమాకు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యాను. ఆచార్య రిలీజైన 20 రోజుల్లోనే దేవర సినిమా మోషన్ పోస్టర్ పనిలో పడ్డాను.
- దేవర సెకండ్ షెడ్యూల్ సమయంలో ఇంత పెద్ద కథను మూడు గంటల్లోపు చెప్పగలమా! అనే అందరం అనుకున్నాం.
- ఎందుకంటే నెరేషన్ 4 గంటలుంది. పేపర్ మీద పెట్టినప్పుడు అది 6-7 గంటలు వస్తుంది.
- సెకండ్ షెడ్యూల్ అప్పుడే మూడు గంటల్లో ఈ కథను చెప్పలేమని అర్థమైంది. రెండు పార్టులు వద్దనుకునే రివర్స్‌లో వెళ్లాం.
- కానీ కుదరదని తెలిసిపోయింది. దాంతో రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నాం.
- ఇదేదో బిజినెస్ కోసమో, సెన్సేషన్ కోసమో కాదు చేసింది. ఓ పార్టులో చెప్పలేని కథను రెండు భాగాలుగా చెప్పాలి.
- లక్కీగా దేవర సినిమాకు సాబు శిరిల్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, అనిరుధ్ వంటి టాప్ టెక్నీషియన్స్ కుదిరారు. ఎవరికీ స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సిన పని లేదు.
- అందుకనే వాళ్ల ఐడియాస్తో వర్క్ చేసుకుని వచ్చారు. అందరూ మంచి టెక్నీషియన్స్ కాబట్టి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు.
- టీమ్ అందంర ఎన్టీఆర్ గారి కోసం చివరి నిమిషం వరకు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టేశాం.
- ఇక రిజల్ట్ విషయమంటారా! అదెప్పుడూ మన చేతిలో ఉండదు.
- దేవర.. అంటే ఎన్టీఆర్ పాత్ర చుట్టూ తిరిగే కథ. ఆయనే హీరో.. అలాంటప్పుడు ఆ పాత్రలో ఎన్టీఆర్‌గారిని కాకుండా మరొకరిని ఎలా అనుకుంటాను.
- కథ రాసుకునేటప్పుడే రెండు పాత్రలకు ఎన్టీఆర్ గారిని అనుకునే రాసుకున్నాను.
- దేవర కొడుకు వర పాత్ర ఆయన్ని మించేలా ఉంటుంది. దేవర రెండు భాగాల్లోనే పూర్తయ్యే సినిమా.
- నాకు, చిరంజీవిగారికి ఎప్పుడూ మంచి అనుబంధం ఉంది.. ఉంటుంది.
- ఆచార్య తర్వాత ఈసారి నువ్వు ఇంకా గట్టిగా హిట్ కొడతావంటూ మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి ఆయన. అలాంటి నాకు, ఆయన మధ్య తేడాలెందుకుంటాయి.
- జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తె అని కానీ.. ప్రతి విషయం ఎంతో జాగ్రత్తగా నేర్చుకుని మరీ చేసింది.
- దేవర సినిమాలో మనిషిలో భయం ఉండాలని నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఆ భయాన్ని నేను జాన్వీలో చూశాను.
- వారం, పది రోజుల ముందు నుండే సీన్ పేపర్ కావాలని నన్ను అడిగి తీసుకుని ప్రాక్టీస్ చేసుకుని సెట్స్‌కు వచ్చేది.
- ఫస్ట్ డే షూటింగ్లో ఆమె నటించిన సీన్ కాగానే తారక్ గారు ఫెంటాస్టిక్ అంటూ చేయి చూపించారు.
- సైఫ్ అలీఖాన్ గారిని ఓంకార సినిమా చూసినప్పడు భైర పాత్రకు సరిపోతాడనిపించింది. అయితే ఈయనలో నార్త్ లుక్ ఉంటుందేమోనని భయపడ్డాను.
- ఇదొక రూటెడ్ ఫిల్మ్‌లాగా ఉందిగా.. నాకు లుక్ సెట్ అవుతుందా! అని సైఫ్గారు కూడా అనుమానం వ్యక్తం చేశారు.
- అయితే నేను లుక్ టెస్ట్ చేద్దామని చెప్పి .. స్కెచ్ వేసి పంపాను. ఆయనే ముందు నమ్మలేదు.
- షూటింగ్ జరిగే సమయంలో ఓ గంట ముందు లొకేషన్‌కు వచ్చి ప్రిపేర్ అయ్యేవారు.
- చివరగా అవుట్‌పుట్ చూసినప్పుడు భైర ఎలా ఉండాలని నేను అనుకున్నానో తను అలాగే ఉన్నారు.
- అనిరుద్ మ్యూజిక్ పట్ల నేను హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నాను.
- ఫియర్ సాంగ్ రిలీజ్ అనుకున్నప్పుడు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడోనని అనుకున్నాను.
- కానీ నా కాన్సెప్ట్ వినగానే తను క్యాచ్ చేసుకుని అద్భుతమైన సాంగ్ ఇచ్చాడు. అప్పుడు తను సింక్‌లో ఉన్నాడనిపించింది.
- త్వరలోనే ఆయుధపూజ సాంగ్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం.
- దేవర సినిమా సెప్టెంబర్ 27న మీ ముందుకు రానుంది. అందరికీ ఓ కన్నుల పండుగలా ఉంటుంది.
- దేవర సినిమా మీదనే ఫోకస్‌గా ఉన్నాం.. నెక్ట్స్ మూవీ ఏంటనేది ఇంకా ఆలోచించలేదు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
Jr NTR Speeches in Multiple Languages | స్టేట్ ఏదైనా బాష ఏదైనా తగ్గేదేలేదంటున్న NTR | RRR Press Meet
06:08
NTR30 First Shot by SS Rajamouli & Prashanth Neel | NTR30 Opening Ceremony | NTR | Janhvi Kapoor
05:05
DEVARA Saif Ali Khan Motion Teaser | Jr NTR | Janhvi Kapoor | Koratala Siva | Anirudh | Fan Made
00:56
NTR Irritated by CM NTR Slogans by Fans | Jr NTR Speech | Thellavarithe Guruvaram Pre Release Event
04:05
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: