మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 అనుకున్న డేట్ కే రానుంది.గత కొన్ని రోజులనుండి రామోజీ ఫిలిం సిటీ లో నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నారు.ఈ వారంలో క్లైమ్యాక్స్ షూటింగ్ పూర్తి కానుంది. ప్రస్తుతం కాకినాడలో కూడా మరో యూనిట్ తో షూటింగ్ జరుగుతుంది.ఇందులో అల్లు అర్జున్ ఒక రోజు పాల్గొనాల్సి వుంది.అది పూర్తి చేస్తే సినిమా కంప్లీట్ కానుంది.దాంతో నవంబర్ లో ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు.ఆతరువాత అన్ని భాషల డబ్బింగ్ పూర్తి చేసి డిసెంబర్ 6న రిలీజ్ కు సిద్ధం చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాపై నేషన్ వైడ్ గా భారీ అంచనాలు వున్నాయి.దాంతో థియేట్రికల్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ వుంది.హిట్ టాక్ వస్తే 1000కోట్ల సినిమాకానుంది.తెలుగుతోపాటు తమిళ ,మలయాళ,కన్నడ,హిందీ తోపాటు బెంగాలీలోకూడా విడుదలచేస్తున్నారు.సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్ ఈసినిమా తరువాత త్రివిక్రమ్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈసినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు రానుంది.త్రివిక్రమ్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కానుంది.ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన జులాయి ,సన్ ఆఫ్ సత్యమూర్తి ,అల వైకుంఠపురములో బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: