దేవర హ్యాంగోవర్ దిగడానికి మంచి రిఫ్రెష్మెంట్ సత్యం సుందరం

Mass Ka Das Vishwak Sen Wish For Super Hit of Devara and Sathyam Sundaram Movies

ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. ’96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పెషల్ గెస్ట్‌లుగా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “కార్తి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని మా తెలుగు హీరో అని చెప్పుకుంటాం. సురేష్ బాబు గారి హ్యాండ్ తోనే నా కెరియర్ స్టార్ట్ అయింది. మా ఫేవరెట్ ప్రొడ్యూసర్ సునీల్ గారు, వారిని ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమ్ కుమార్ గారు నా డ్రీమ్ డైరెక్టర్. 96 సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. నా ఫేవరెట్ ఫిలిం అది. ఒక లవ్ స్టోరీ అయినప్పటికీ మాస్ సినిమా లెవెల్ లో ఆ సినిమాకి విజిల్స్, అరుపులతో సూపర్ రెస్పాన్స్ వచ్చింది” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “28న డెఫినెట్‌గా ఈ సినిమా చూడండి. అలాగే 27న దేవర చూడండి. రెండు సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. 27న ఫుల్ బాటిల్ తాగినంత హ్యాంగోవర్ వస్తే, 28న ఆ హ్యాంగోవర్ దిగడానికి ఒక మంచి రెఫ్రిస్మెంట్ లాంటి సినిమా సత్యం సుందరం. రెండు సినిమాలకి ఆల్ ది వెరీ బెస్ట్” అని చెప్పారు హీరో విశ్వక్ సేన్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.