యంగ్ హీరో సందీప్ కిషన్ 30వ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ వచ్చేసింది.ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకు మజాకా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.టైటిల్ కు తగ్గట్లే ఫస్ట్ లుక్ పోస్టర్ లో హుషారుగా కనిపించాడు సందీప్ కిషన్.అయితే ఈసినిమాకోసం ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయాల్సివుంది.ఫన్ &ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్,హాస్య మూవీస్,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈసినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.అయితే పండగ బరిలో విశ్వంభర,వెంకీ అనిల్ 3 వంటి పెద్ద సినిమాలు కూడా వున్నాయి.ఇక వాటితో పాటుగా మజాకా కూడా బరిలోకి దిగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ,స్క్రీన్‌ప్లే,డైలాగ్‌లు అందిస్తుండగా లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.ఇక ఈసినిమాతో సందీప్ కిషన్ పేరుకు ముందు ట్యాగ్ కూడా వచ్చింది.పోస్టర్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ అని వేశారు.అంతేకాదు న్యూమరాలజీ ప్రకారం కిషన్ లో ఇంగ్లీష్ అక్షరం ఏ ను తీసేశారు.మరి ఈసెంటిమెంట్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
ఇక వరస పరాజయాల తరువాత గత ఏడాది ఊరు పేరు భైరవ కోనతో హిట్ కొట్టాడు సందీప్ కిషన్.రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ రాయన్ లోకూడా కీలక పాత్రలో కనిపించాడు సందీప్.త్వరలోనే తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























