తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ముమ్ముర సహాయక చర్యలను చేపట్టింది. అయితే ఈ విపత్తుపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎంతోమంది స్టార్ హీరోలు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన వంతు సహాయంగా రూ.50 లక్షలు భారీ విరాళం ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి సతీమణి నమ్రతా శిరోద్కర్ తో కలిసి వెళ్లిన హీరో మహేష్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించిన డొనేషన్ చెక్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహేష్ దంపతులను అభినందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: