దేవర.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు, స్పందించిన ఎన్టీఆర్

Jr NTR Reacts As Devara Pre Release Event Cancellation

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషించగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. అయితే ఆదివారం జరగాల్సిన ఈ ఈవెంట్‌ అనుకోని విధంగా క్యాన్సిల్‌ అయ్యింది. దీంతో తారక్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఈవెంట్ నిర్వహించే వేదిక వద్ద వారు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు.

అందులో ఆయన మాట్లాడుతూ.. “దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ అయినందుకు మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నా. ఈవెంట్‌లో దేవర అనుభవాలన్నీ మీతో పంచుకోవాలని ఆశించాను. కానీ.. సెక్యూరిటీ ప్రాబ్లమ్‌ వల్ల క్యాన్సిల్‌ చేయాల్సివచ్చింది. మీకు ఆనందాన్ని పంచేందుకు ఎంతో కష్టపడి దేవర చేశాను. అది రేపు థియేటర్లలో మీరు చూస్తారు. ఈ నెల 27న థియటర్లలో కలుద్దాం” అని తెలిపారు.

కాగా దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్‌ పాత్రలో కనిపించనుండగా.. అలాగే ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.