ఎన్టీఆర్ దేవర ఫస్ట్ పార్ట్ మరో 4రోజుల్లో ప్రేక్షకులముందుకు రానుంది.దాంతో తెలుగు రాష్ట్రాల్లో దేవర మానియా ఇప్పటికే స్టార్ట్ అవ్వగా బెన్ఫిట్ షో టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ వుంది.రేపటి నుండి రెండు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.ఆంధ్రాలో టిక్కెట్ హైక్స్ ,ఎర్లీ మార్నింగ్ షోలకు పర్మిషన్ వచ్చింది.తెలంగాణలో రావాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఇంతకుముందు వచ్చిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని అంచాలను పెంచగా తాజాగా నిన్న మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈరిలీజ్ ట్రైలర్ లో ఫస్ట్ ట్రైలర్ కు మించిన యాక్షన్ ను చూపించారు.విజువల్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఓవరాల్ గా రిలీజ్ కుముందు రిలీజ్ ట్రైలర్ ఫ్యాన్స్ కు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది.ఇక నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగాల్సివుండగా ఊహించిన దానికి కంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు రావడం తో క్యాన్సల్ చేశారు.రిలీజ్ కు ముందు ఇంకో ఈవెంట్ ఉండకపోవచ్చు.
ఇక దేవర ముందు భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వుంది.హిట్ టాక్ వస్తే ఈ టార్గెట్ కేక్ వాక్ కానుంది.సోలో రిలీజ్ కూడా అడ్వాంటేజ్ కానుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొరటాల శివ ఈసినిమా ను తెరకెక్కించగా ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.ఎన్టీఆర్ ఆర్ట్స్,యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల పై హరికృష్ణ , సుధాకర్ మిక్కిలినేని నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: