నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొన్నిరోజుల క్రితం మేకర్స్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇక ఇటీవలే నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మా నాన్న సూపర్ హీరో నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది. ‘నాన్నా’ అంటూ సాగే ఈ ఫుల్ వీడియో సాంగ్ హృద్యంగా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలావుంది.
ప్రతి కొడుకు తన తండ్రికి హార్ట్ ఫుల్‌గా రాసే ప్రేమ లేఖ లాంటి అనుభవాన్ని ఇచ్చే ఈ సాంగ్‌లో కొడుకు తన తండ్రి పట్ల ఉన్న ప్రేమ, అభిమానాన్ని అందంగా ప్రజెంట్ చేస్తోంది. తన తండ్రి తనను పూర్తిగా నెగ్లెట్ చేసినప్పటికీ, అతనితో సమయం గడపడానికి కొడుకు ఆనందపడతాడు. పెళ్లి భోజన సమయంలో సుధీర్ బాబు తన తండ్రికి నీళ్ళు అందజేస్తూ, తన అభిమానాన్ని చూపించడం ఈ సాంగ్‌లో హైలెట్ మూమెంట్‌గా నిలిచింది.
ఇక ఈ సాంగ్‌లో సుధీర్ బాబు కూల్‌గా కనిపించారు, సాయాజీ షిండే ఎరోగెంట్ ఫాదర్‌గా తన నేచర్ చూపించారు. నాన్న సాంగ్ విజువల్స్ హత్తుకునేలా ఉన్నాయి, ఈ సాంగ్ తండ్రి కొడుకు బాండింగ్‌కి మెమరబుల్ ట్రిబ్యూట్‌లా వుంది. అలాగే జై కృష్ణ అద్భుతమైన నెంబర్‌ని స్కోర్ చేయగా.. లక్ష్మీ ప్రియాంక లిరిక్స్ భావోద్వేగాలను ఇంటెన్స్‌గా ప్రజెంట్ చేస్తోంది. నజీరుద్దీన్ వోకల్స్ డెప్త్‌ని యాడ్ చేశాయి. రాజు సుందరం కొరియోగ్రఫీ కూడా చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా వుంది.
ఇక మా నాన్న సూపర్ హీరో చిత్రానికి అనిల్ కుమార్ పి ఎడిటర్ కాగా, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. అలాగే అభిలాష్ రెడ్డి కంకర, MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల రైటర్స్‌గా పని చేస్తున్నారు. టీజర్ ద్వారా అనౌన్స్ చేసిన విధంగా, మా నాన్న సూపర్ హీరో సినిమాను అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: