తిరుమల శ్రీవారి సన్నిధిలో 35 టీమ్

Actress Nivetha Thomas Visits Tirumala Temple Along With 35 Chinna Katha Kaadu Team

స్టార్ హీరోయిన్ నివేదా థామస్‌ తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆమె ఇటీవలే తాను నటించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్ర బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్టార్ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేదా థామస్, విశ్వదేవ్ జంటగా నటించగా.. ప్రియదర్శి కీలక పాత్రలో కనిపించాడు. అలాగే సీనియర్ నటులు గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యం, చైల్డ్ సైకాలజీ, మదర్ సెంటిమెంట్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 35 చిత్ర యూనిట్ సక్సెస్ టూర్‌ నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా తాజాగా తిరుపతి వెళ్లిన టీమ్‌ ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. ఇక అంతకుముందు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు యూనిట్ సభ్యులు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.