జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా శ్రీలంక లో ఓ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ కేరళ లో ఈనెల 15నుండి స్టార్ట్ కానుందని సమాచారం.దాదాపు నెల రోజులు ఈ షెడ్యూల్ జరుగనుంది.దీంతో సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాపై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ రాలేదు.అయితే వచ్చే నెలలో టైటిల్ తో పాటు కీలమైన అప్డేట్ ఇవ్వనున్నారు.గ్యాంగ్ స్టార్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సేను హీరోయిన్ గా తీసుకున్నారట.ఈవిషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది.
ఇక ఈసినిమా కాకుండా విజయ్ మరో రెండు సినిమాలకు సైన్ చేశాడు.అందులో రవి కిరణ్ కోలాతో ఓ సినిమా చేయనున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నాడు.ఈఏడాది చివర్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ వుంది.ఇక మరొకటి రాహుల్ సంకృత్యాన్ తో చేయనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఈసినిమా వచ్చే ఈఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.
మరోవైపు ఎప్పటినుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు విజయ్ దేవరకొండ.గీత గోవిందం తరువాత ఇంతవరకు ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు. మరి రానున్న ఈ మూడు సినిమాలు విజయ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: