గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకోవటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తెలుగు చిత్ర పరిశ్రమ బాసటగా నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్ సహా ఎంతోమంది హీరోలు భారీ విరాళాలు ప్రకటించి తమ ఉదారత చాటుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా మరో స్టార్ హీరో వరద బాధిత ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకువచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం రూ.1కోటి భారీ విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆయన ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
అందులో ఆయన.. “ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో వినాశకరమైన వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని మరియు బాధను చూసి నేను బాధపడ్డాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, సహాయ చర్యలకు మద్దతుగా నేను రెండు రాష్ట్రాల సిఎం రిలీఫ్ ఫండ్‌లకు మొత్తం ₹1 కోటి విరాళంగా ఇస్తున్నాను. అందరి భద్రత కోసం ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: