కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

గోపీచంద్ విశ్వం టీజర్ రిలీజ్

Macho Star Gopichand' and Sreenu Vaitla Combo Movie Viswam Teaser Released

గోపీచంద్ విశ్వం టీజర్ రిలీజ్

Macho Star Gopichand’ and Sreenu Vaitla Combo Movie Viswam Teaser Released

Macho Star Gopichand' and Sreenu Vaitla Combo Movie Viswam Teaser Released

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ క్రేజీ కాంబో నుంచి ఈద్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్ వీడియో ఆడియెన్స్ కి మాస్ ఫీస్ట్‌ని అందించింది. గోపీచంద్ 32వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తుండగా.. రీసెంట్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే.

శ్రీను వైట్ల కెరీర్‌లోని ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌లో భాగస్వామ్యం ఉన్న స్క్రీన్ రైటర్ గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో గోపీచంద్‌ మాసీ లుక్‌లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో విశ్వం సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ శ్రీను వైట్ల తరహా కామెడీతో సాగింది. గోపీచంద్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది.

మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న వీరిద్దరికి విశ్వం సినిమాతో అయినా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. ఇక టీజర్‌తో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు మేకర్స్. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్