నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హైదరాబాద్ లోని సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్‌ఫ్లిక్ట్‌ని ప్రజెంట్ చేసింది. గ్రిప్పింగ్ ట్రైలర్ ఇంపాక్ట్ ఫుల్ స్టొరీ మెయిన్ పార్ట్‌ని రివిల్ చేస్తోంది. మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్‌ని కట్టిపడేసింది. నెరేటివ్ అదిరిపోయింది, పెర్ఫార్మెన్స్,టెక్నికల్ వాల్యూస్ ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయి.
సిఐ దయానంద్ చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుర్రాడైన సూర్య తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగితే సహించలేడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్స్ వార్‌ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆదరగొట్టారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం అనిపించింది. ఎస్‌జె సూర్య డైనమిక్ పాత్రలో కనిపించారు. ప్రియాంక మోహన్ నాని క్యారెక్టర్ ప్రేమలో ఉన్న కానిస్టేబుల్‌గా ఆకట్టుకుంది.
మురళి జి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, జేక్స్ బిజోయ్ తన అద్భుతమైన స్కోర్‌తో నెరేటివ్‌ని ఎలివేట్ చేశారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి చాలా గ్రాండ్‌గా సినిమాని నిర్మించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఈ విజిల్-వర్తీ ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: