ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు రెండున్నరేళ్ల తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. తారక్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి మేకర్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా మరో సాలిడ్ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమాలో ఎన్టీఆర్ షూటింగ్ పూర్తయింది. ఈవిషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. దేవర పార్ట్ 1 లో నా లాస్ట్ షాట్ పూర్తయింది.. ఎంతో అద్భుతమైన జర్నీ..నేను ఈ సముద్రమంత ప్రేమను, అద్భుతమైన టీమ్ ను మిస్ అవుతాను. సెప్టెంబర్ 27న రాబోతున్న శివ సృష్టించిన ఈ ప్రపంచంలోకి ప్రతి ఒక్కరూ వస్తే చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను చేశారు. ఇప్పుడు పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక సెకండ్ సింగిల్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నాం. చుట్టమల్లే చుట్టేస్తాందే అంటూ ఎన్టీఆర్-జాన్వీ కపూర్ మధ్య వచ్చే ఈపాట సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈపాటలో జాన్వీకపూర్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఈపాటతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మరింత పెరిగాయి.
కాగా ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: