టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి తనపైన ఎంతో నమ్మకం వుందని, అందుకే తన ఫస్ట్ సినిమా సైతం చూడకుండానే ‘యువరాజు’ చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారని తెలిపారు సీనియర్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. ఈ మేరకు ఆయన శుక్రవారం మహేష్ బాబు బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ తన కొత్త ప్రాజెక్ట్‌కి సంబధించి క్రేజీ అప్‌డేట్స్ అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. “సభకు నమస్కారం. ఈ రోజు చాలా ఆనందంగా వుంది. ఈ రోజు నాగ పంచమి. మొదటి శ్రావణ శుక్రవార శుభ సందర్భం. ఈ సినిమాకి సంబధించిన మొదటి ఈవెంట్ మా ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు గారి అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజున జరుపుకున్నాం” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇక ఈ రోజు కార్యక్రమం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్ డే సందర్భంగా జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. మహేష్ బాబు అంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నపటినుంచి ఇష్టం. మహేష్ గారు నా మొదటి సినిమా చూడకుండానే ‘యువరాజు’ సినిమాకి అవకాశం ఇచ్చారు. అది ఆయన నామీద ఉంచిన నమ్మకం. ఆ నమ్మకం నాకు ఎంతో ఆత్మీయంగా అనిపించింది” అని పేర్కొన్నారు.
“రాజకుమారుడు చేస్తున్న సమయంలోనే నా నిర్మాణ సంస్థ బొమ్మరిల్లుని స్థాపించాను. ‘లాహిరి లాహిరి’లో సినిమా విజయోత్సవ వేడుకకు ఆయనే స్వచ్చందంగా వచ్చి వెన్నంటి వున్నారు. ఆ సినిమా వందరోజుల వేడుక మహేష్ బాబు గారి బర్త్ డే రోజు ఆగస్ట్ 9నే గ్రాండ్‌గా చేశాను. అనుకోకుండా ఇదే రోజున ఈ వేడుక జరుకుపోవడం చాలా ఏమోషనల్‌గా వుంది” అని చెప్పారు దర్శకుడు వైవిఎస్ చౌదరి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: