గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులోనూ ఈ ఏడాదే సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో పవన్ ఫుల్ టైమ్ ను రాజకీయాలకే కేటాయించారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి.. పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కూడా స్వీకరించారు. నాలుగు శాఖలు పవన్ డీల్ చేస్తుండటంతే ఎలాంటి విశ్రాంతి అనేది లేకుండానే మొదటి రోజు నుండీ విధులు నిర్విర్తిస్తూనే ఉన్నారు. దీనికి గాను ఒకవైపు పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నా.. మరోవైపు పవన్ సినిమా నుండి ఒక సినిమా వస్తే బాగుండు అని కూడా కోరుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీలయ్యే ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. అందేంటంటే ఒక ఈసినిమా షూటింగ్ కు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ అక్టోబర్ 1 నుంచి రెండు వారాలు వరకు పవన్ ఈసినిమాకు డేట్స్ ఇచ్చారని అంటున్నారు. పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: