న్యాచురల్ స్టార్ నాని నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ అన్న అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఆగష్ట్ 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో నాని పాత్రపై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇక చిత్రయూనిట్ మరోవైపు వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పలు గ్లింప్స్, పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
ఇక ఈసినిమాలో ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. దీనిలో భాగంగానే నాని పాత్ర గురించి మాట్లాడుతూ.. నానికి చిన్నప్పటి నుండీ చాలా కోపం ఉంటుంది.. ఆ కోపంతోనే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆ సమస్య నుండి కాపాడటానికి అతని తల్లి నానికి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్లాన్ సెట్ చేస్తుంది. అయితే శనివారానికి మాత్రం మినహాయింపు తీసుకుంటాడు నాని. ఈ నేపథ్యంలోనే శనివారం ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి అనేది ఈసినిమా కథగా వస్తుంది.
కాగా ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య, అభిరామి, సాయి కుమార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు.. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈసినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: