సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా వెట్టైయాన్. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కతుంది. ఈసినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్ టైటిల్ టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో టాలెంటెడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక నేడు ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఇప్పటికే ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ ను అందించారు. ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తో వచ్చారు. ఇద్దరు లెజెండరీస్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ తో సెట్స్ లో ఫహాద్ దిగిన పిక్ ను పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగాఈసినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇంతకుముందు ఆక్టోబర్ 10వ తేదీన ఈసినిమా వస్తుందని అన్నారు. అయితే రీసెంట్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇంకా లాక్ చేయలేదు.. డబ్బింగ్ పనులు అయితే జరుపుకుంటుందని రజనీకాంత్ చెప్పడంతో మరోసారి రిలీజ్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. మరోవైపు దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో ఇంకా మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, జీఎం సుందర్, రోహిణి, రావు రమేష్ పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబస్కరన్ నిర్మిస్తున్న ఈసినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: