ఒక నెల గ్యాప్‌లో ఏకంగా 6 సినిమాలు రీ-రిలీజ్‍

Tollywood 6 Movies to be Re-released in Just One Month Gap

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన అగ్ర హీరోల సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్‍ చేస్తున్నారు. అయితే రీ-రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఎప్పుడో తమ చిన్నతనంలో చూసిన తమ ఫెవరేట్ హీరోల చిత్రాలను మళ్ళీ మరోసారి థియేటర్లలో చూసేందుకు వారు చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో మేకర్స్ కూడా స్టార్ హీరోల హిట్ సినిమాలను రీ-రిలీజ్‍ చేసేందుకు ముందుకొస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మారిన టెక్నాలజీకి అనుగుణంగా పాత చిత్రాలను 4కెలో మళ్ళీ అందిస్తుండటంతో మూవీ లవర్స్ కూడా థియేటర్లలో మంచి అనుభూతిని పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఒక నెల గ్యాప్‌లో ఏకంగా 6 సినిమాలు రీ-రిలీజ్‍ కానుండటం విశేషం. జూలై 27 నుంచి ఆగస్టు 29 మధ్య కాలంలో థియేటర్లలో రీ-రిలీజ్ అవుతున్న చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రవితేజ నటించిన మూవీస్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలో రీ-రిలీజ్ అవుతున్న సినిమాలు, అవి ఏయే తేదీలలో విడుదలవుతున్నాయి వంటి వివరాలు ఇక్కడ చూద్దాం..

  • విక్రమార్కుడు – జూలై 27 (ఎస్ఎస్ రాజమౌళి – రవితేజ, అనుష్క)
  • ఎటో వెళ్లిపోయింది మనసు – ఆగస్టు 2 (గౌతమ్ మీనన్ – నాని, సమంత)
  • ఒక్కడు – ఆగస్టు 8 (గుణశేఖర్ – మహేష్ బాబు, భూమిక)
  • మురారి – ఆగస్టు 9 (కృష్ణవంశీ – మహేష్ బాబు, సోనాలి బింద్రే)
  • ఇంద్ర – ఆగస్టు 22 (బి గోపాల్ – చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్)
  • శివ – ఆగస్టు 29 (రామ్ గోపాల్ వర్మ – నాగార్జున, అమల)

కాగా మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున పుట్టినరోజు సందర్భంగా.. ఒక్కడు, మురారి, ఇంద్ర, శివ సినిమాలు విడుదల కానుండటం విశేషం. ఇక వీటితోపాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం కూడా ఆయన జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల కానున్నట్టు సమాచారం.

ఆన్‍లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.