ఉండి అభివృద్ధికి రూ.3 లక్షలు అందజేసిన రావు రమేష్

Actor Rao Ramesh Gives Rs 3 Lakh Cheque To MLA Raghu Rama Krishna Raju For Development Works in Undi

ప్రముఖ టాలీవుడ్ క్యారక్టర్ నటుడు రావు రమేష్ గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉండి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణరాజును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రావు రమేష్ నియోజకవర్గం అభివృద్ధికోసం తన వంతు బాధ్యతగా 3 లక్షల చెక్కును ఎమ్మెల్యేకు అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉండి నియోజకవర్గంలో డ్రైనేజీ మరియు నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం ఈ మొత్తాన్ని వినియోగించాల్సిందిగా ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును ఆయన కోరారు. అందుకు సమ్మతించిన ఎమ్మెల్యే రఘురామ, రావు రమేష్‌ను అభినందించారు. కాగా గతంలో కూడా రావు రమేష్ తన పర్సనల్ మేకప్ మ్యాన్‌గా పనిచేస్తున్న బాబు అనే వ్యక్తి మృతిచెందగా.. వారి కుటుంబానికి రూ.10 లక్షలు అందించి సాయమందించారు.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.