పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తమ్ముడు (కజిన్) విరాట్ రాజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. కాగా విరాట్ రాజ్, దివంగత నటుడు కృష్ణంరాజు కుటుంబానికి దగ్గరి బంధువు కావడం గమనార్హం. తాజాగా ఆయన కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్‌పై ఎస్ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్‌లు ఈ సినిమాను నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పూజా ముహూర్తంతో సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ మూవీ టైటిల్‌ను ఆవిష్కరించారు. కాగా ఈ చిత్రానికి గౌడ్ సాబ్ అనే టైటిల్ పెట్టారు. గణేష్ మాస్టర్ నుంచి కథ విన్నానని, పూర్తిగా నచ్చిందని ఈ సందర్భంగా సుకుమార్ తెలిపారు. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన అంచనా వేశారు. అలాగే గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ మరియు మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక గౌడ్ సాబ్ ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని టైటిల్ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఇంకా సినిమాలో మంత్రముగ్ధులను చేసే ప్రేమకథ ఉంటుందని సూచిస్తూ, టైటిల్ పోస్టర్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కాకుండా ఆమె ముఖం కనిపించనప్పటికీ, వోణీ అమ్మాయి కనిపిస్తుంది. ఈ చిత్రానికి ఆర్ఎం స్వామి సినిమాటోగ్రఫీ.. గీత రచయిత వెంగీ సంగీత దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బేబీ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్. భాను మాస్టర్ క్రియేటివ్ హెడ్ కాగా, మహాదేవ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్. ఈ చిత్రంలో నటించనున్న కథానాయిక సహా ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: