టిల్లు స్క్వేర్ సెన్సార్ కంప్లీట్.. రిలీజ్‌కు సిద్ధం

Siddhu Jonnalagadda's Tillu Square Movie Certified with UA

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్దు సరసన మల్లు బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఇటీవలే రిలీజైన మూడో సాంగ్ ‘ఓ మై లిల్లీ’ బాగా ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను అందించింది చిత్ర యూనిట్. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ అందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. సో.. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ముందుగా ప్రకటించినట్లు మార్చి 29న థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉంది. ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

కాగా ‘డీజే టిల్లు’ చిత్రంతో సిద్దు జొన్నలగడ్డ యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అందులో టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకులని అలరించాయి. మరోవైపు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఇంతకుముందులా కాకుండా ఇందులో చాలా కొత్తగా, బోల్డ్‌గా కనిపించనుంది. అలాగే సిద్ధు, అనుపమ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా కుదిరిందని చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో ‘టిల్లు స్క్వేర్’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =