బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న గామి.. 3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

Vishwak Sen's Gaami Collects 20.3 Cr Gross Worldwide in 3 Days

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ వినిపించింది. ట్రైలర్ తర్వాత మంచి బజ్ ఏర్పడటంతో భారీ ఓపెనింగ్ సాధించింది. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీకి ఆడియెన్స్ మౌత్ టాక్ స్ప్రెడ్ బాగా కలిసొచ్చింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌రియన్స్ ఇస్తోందని ఇలా ఈ చిత్రంపై చాలా ప్రశంసలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ‘గామి’ చిత్రం ఫస్ట్ వీకెండ్‌ గడిచేసరికి ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మేరకు విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్‌సేన్ నటన అద్భుతంగా ఉందంటూ ఆడియెన్స్ కితాబిస్తున్నారు. కాగా గామి చిత్రం తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. తొలి రోజు సుమారు రూ.9 కోట్లను అందుకున్న ఈ మూవీ.. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ రూ.6 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 8 =