గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ రిలీజ్

Geethanjali Malli Vachindhi movie teaser released

హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది. అంజ‌లి ప్ర‌ధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ ‘గీతాంజ‌లి’ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్ల‌పాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రీసెంట్ గానే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. అంజలి పోస్టర్ ను అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా టీజర్ ను బేగంపేట్ శ్మశాన వాటికలో రిలీజ్ చేస్తున్న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎప్పుడేతే స్మశాన వాటికలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారో అప్పటినుండి టీజర్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం నవ్విస్తూ భయపెట్టింది. సినిమా షూటింగ్‌కు కోసం వెళ్లిన ఓ డ్యాన్స్ మాస్టర్ భవనంలో జరిగిన సంఘటనలతో గీతాంజలి మళ్లీ వచ్చింది తెరకెక్కినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. సినిమాలో కామెడీ, హార్రర్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. టీజర్ అయితే సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది.

కాగా ఈసినిమాలో ఇంకా మలయాళ నటుడు రాహుల్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈసినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు రాహుల్. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =