దిల్ రాజు ఇంట శుభకార్యం.. మహేష్ బాబు దంపతులకు ఆహ్వానం

Producer Dil Raju Invites Mahesh Babu for his Nephew Ashish's Wedding

టాలీవుడ్ అగ్ర నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఇంట త్వరలో శుభకార్యం జరగబోతునున్న విషయం తెలిసిందే. ఆయ‌న సోద‌రుడు శిరీష్ తనయుడు, ట్యాలెంటెడ్ హీరో ఆశిష్ వివాహం ఈ నెలలో జరుగనుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు గత వారం రోజులుగా సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను కలిసి ఈ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా దిల్ రాజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశారు. ఈ మేరకు తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం మహేష్ ఇంటికి వెళ్లారు దిల్ రాజు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత దంపతులకు ఆశిష్ వివాహ ఆహ్వాన పత్రిక అంద‌జేశారు. తమ ఇంట జరుగుతున్న ఈ శుభకార్యానికి రావాల్సిందిగా ఆహ్వానించిన దిల్ రాజు.. నూతన వధూవరులకు సూపర్ స్టార్ దంపతులు ఆశీస్సులు అందించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్వైతా రెడ్డితో ఆశిష్‌ రెడ్డి వివాహం ఫిబ్రవరి 14న జరుగనుంది. జైపూర్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్న ఈవెంట్‌లో వివాహ బంధంతో వీరు ఒక్కటి కాబోతున్నారు. ఇక గతేడాది నవంబర్‌ 30న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

ఇక ఇదిలావుంటే.. మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 09, 2024) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. మరోవైపు దర్శక ధీరుడు రాజమౌళితో మహేశ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. #ఎస్‌ఎస్‌ఎంబీ29గా వ్యవహరిస్తున్న ఈ పాన్ గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ సినిమా కోసం మహేశ్ ఇటీవలే స్పెషల్ ఫిట్‍నెస్ ట్రైనింగ్ తీసుకోవడానికి జర్మనీకి వెళ్లి వచ్చారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైన ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + six =