మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’.. ప్రధాని మోదీ హర్షం

PM Modi Delighted For Former Prime Minister PV Narasimha Rao Honoured with Bharat Ratna

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలుగువారికి గర్వకారణమైన నేత, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్ర‌ధానమంత్రి పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భార‌త‌ర‌త్న’ ప్ర‌క‌టించింది. ఆయనతో పాటు మ‌రో మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్‌ మరియు దిగ్గజ వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ఎంఎస్ స్వామినాథ‌న్‌కు కూడా కేంద్రం భార‌తర‌త్న అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఇక పీవీ న‌రసింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వ‌డం ప‌ట్ల ప్రధాని మోదీ  హర్షం వ్య‌క్తం చేశారు. విభిన్న హోదాల్లో ప‌నిచేసిన‌ పీవీ మేధావి అని, నిజమైన రాజ‌నీత‌జ్ఞుడని మోదీ కీర్తించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ప్ర‌ధాని మోదీ ఎక్స్ వేదికగా.. “మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారిని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు గారు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా చేసిన కృషిని ఆయన సమానంగా గుర్తుంచుకుంటారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది, దేశం యొక్క శ్రేయస్సు మరియు అభివృద్ధికి బలమైన పునాది వేసింది” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “ప్రధానమంత్రిగా నరసింహారావు గారి పదవీకాలం భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు తెరిచి, ఆర్థికాభివృద్ధిలో కొత్త శకాన్ని ప్రోత్సహించే ముఖ్యమైన చర్యలతో గుర్తించబడింది. ఇంకా, భారతదేశం యొక్క విదేశాంగ విధానం, భాష మరియు విద్యా రంగాలకు ఆయన అందించిన సహకారం భారతదేశాన్ని క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా దాని సాంస్కృతిక మరియు మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా అతని బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతుంది” అని పీవీ నరసింహారావు దేశానికీ చేసిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 1 =