మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’. నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మిస్టర్ బచ్చన్’ తదుపరి షెడ్యూల్ ఫిక్స్ అయింది. దీనికోసం బచ్చన్ టీం కేరళలోని కరైకుడికి బయలుదేరింది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #MrBachchan off to Karaikudi for a very interesting schedule 🎥
The team will shoot key scenes in and around the area during this schedule 📽️🎞️#MassReunion
Mass Maharaja @RaviTeja_offl @harish2you @vishwaprasadtg @peoplemediafcy @PanoramaMovies @vivekkuchibotla… pic.twitter.com/VLRdUW8mYW— Telugu FilmNagar (@telugufilmnagar) January 24, 2024
కాగా ఈ షెడ్యూల్‌లో కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక హీరో రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా.. అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అలాగే అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా.. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: