యూఎస్ లో డెవిల్ సత్తా.. సెకండ్ హయ్యస్ట్ గ్రాస్ మూవీగా రికార్డ్

kalyan ram devil movie usa collections update

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించాడు.ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే రోజు రోజుకీ కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడ మాత్రమే కాదు ఈసినిమా యూఎస్ లో కూడా కలెక్షన్స్ పరంగా తన సత్తా చూపిస్తుంది. ఈసినిమా సెకండ్ హయ్యస్ట్ గ్రాస్ మూవీగా అప్పుడే రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఇక ముందు ముందు కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకునే అవకాశం ఉంది.

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.