ఈమధ్య సినిమాలకు ఏ సర్టిఫికేట్ రావడం కామన్ అయిపోయింది.ఈ సర్టిఫికేట్ వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి దూరం అవుతారు.ఎందుకంటే ఏ సర్టిఫికేట్ అంటే చిన్న పిల్లలు చూడడానికి అనుమతి ఉండదు.దాంతో ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లలో సినిమా అవకాశం తక్కువ.అయితే రీసెంట్ గా వచ్చిన రెండు సినిమాలు ఏ సర్టిఫికేట్ తో వచ్చాయి.ఈరెండు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి అందులో యానిమల్ ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హింస ఎక్కువ ఉండడం వల్ల సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది అయినా కూడా యానిమల్ 800కోట్ల కలెక్షన్స్ తో రికార్డు సృష్టించింది.ఇప్పటికి థియేటర్లలో డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.ఇక నిన్న విడుదలైన సలార్ కూడా ఏ సర్టిఫికేట్ తోనే వచ్చింది ఈసినిమా మొదటి రోజే 200కోట్లకు దగ్గర దాకా వచ్చింది.కంటెంట్ ఉంటే ఏ సర్టిఫికెట్ సినిమాను ప్రభావితం చేయలేదు అని మేకర్స్ కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.
ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ఇదే సర్టిఫికేట్ తో రానుంది.అయితే ఫై రెండు సినిమాల్లాగా ఇది భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ సినిమాకాదు.ఇదో చిన్న సినిమా అదే బబుల్ గమ్.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమా ఫై అంచనాలను ఏర్పరిచింది.యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో వస్తుంది.ఈసినిమా తో సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈసినిమాను బడా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుంది.ఈనెల 29న థియేటర్లలోకి రానుంది.మరి ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























