ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చ‌రణ్, ఉపాసన దంపతులు

Ram Charan and Upasana Shine on Popular Magazine Cover Page

మెగా పవర్ స్టార్ రామ్ చ‌రణ్, ఉపాసన దంపతులు ఒక అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లీష్ మ్యాగజైన్ ఫోర్బ్స్ కవర్ పేజీపై వీరి ఫోటో ప్రచురితమైంది. ఈ సందర్భంగా ‘సూపర్ కపుల్’ అంటూ కవర్ పేజీపై క్యాప్ష‌న్ ఇవ్వడం గమనార్హం. కాగా ఇప్పటివరకు మరే టాలీవుడ్ జంట ఇలా ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించలేదు. దీంతో తొలిసారి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్ దంపతులు జంటగా నిలిచారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంట‌ర్వ్యూలో భాగంగా ఈ ఫొటో షూట్ జ‌రిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫొటోలో ఉపాసన కొణిదెల పైన సోఫాలో కూర్చుని ఉండగా.. రామ్ చరణ్ ఆమె ముందు కింద కూర్చుని కనిపించారు. అలాగే ఇద్దరూ పింక్ కలర్ డిజైనర్ డ్రెసులు ధరించి చాలా అందంగా కనిపిస్తున్నారు. కాగా ఈ ఇంట‌ర్వ్యూలో భాగంగా.. రామ్ చరణ్, ఉపాసనల‌ ల‌వ్ స్టోరీ, వివాహం చేసుకోవడం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలపై వారు సమాధానించినట్లు తెలుస్తోంది. ఇంకా వారి వైవాహిక జీవితం, క్లీంకార వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వ‌చ్చాయి అనే విషయాల గురించి కూడా వెల్ల‌డించినట్లు సమాచారం.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీకి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్‌, ‘రోబో’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 2 =