కన్నప్ప హీరోయిన్ ఫిక్స్

manchu vishnu kannappa movie heroine fixed

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచువిష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. న్యూజిలాండ్ లోనే ఈసినిమాలోని ఎక్కువ భాగం చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమా హీరోయిన్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. నిజానికి ముందుగా ఈసినిమాలో హీరోయిన్ గా నుపుర్ సనన్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే తను ఈసినిమా నుండి తప్పుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా కోసం మరో హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్.మోడల్ ప్రీతి ముకుందన్ ఈసినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది. ప్రీతి ముకుందన్ భరతనాట్య కళాకారిణి. ఈ సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ప్రీతి ముకుందన్.

కాగా ఈసినిమాలో పెద్ద పెద్ద స్టార్లు అందరూ జాయిన్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఈసినిమాలో నటిస్తున్నారు. ఇంకా పలువురు స్టార్లు ఈసినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్‌ ఇంకా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.