బిగ్ బాస్ 7.. 12వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా అమర్ దీప్ యావర్, రతికను.. గౌతమ్ ప్రశాంత్ ను, శివాజీ ని.. రతిక అమర్ దీప్ ను ప్రశాంత్ ను.. అర్జున్ శివాజీని, యావర్ ను.. ప్రశాంత్ గౌతమ్ , రతికను నామినేట్ చేశారు. అశ్విని తన దగ్గర రీజన్స్ లేవని సెల్ఫ్ నామినేషన్ వేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న ఎపిసోడ్ సోమవారం ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుండే మొదలవుతుంది. నామినేషన్ ప్రాసెస్ లో భాగంగా శివాజీ వచ్చి ముందుగా గౌతమ్ ను నామినేట్ చేస్తాడు. ఇక ఇక్కడ గౌతమ్, శివాజీ ఇద్దరూ వాదించుకుంటారు. ఆతరువాత అశ్వినిని నామినేట్ చేస్తాడు. అయితే అశ్విని అప్పటికే సెల్ఫె నామినేట్ చేసుకోవడంతో అశ్వినిని నామినేట్ చేయడం కుదరదని బిగ్ బాస్ చెప్పడంతో అర్జున్ ను నామినేట్ చేస్తాడు.
అనంతరం యావర్ వచ్చి అమర్ దీప్ ను అర్జున్ ను నామినేట్ చేస్తాడు. ఈ సందర్బంగా ప్రతివారం నాగ్ సర్ వేసే వీడియోలను బట్టి.. మాటలను బట్టి నామినేషన్స్ ఉంటున్నాయి.. అందరితో కలవడం లేదు.. సేఫ్ గా ఆడుతున్నావు అంటూ సీరియస్ అవుతాడు. అంతేకాదు ఇక ఉన్నన్ని రోజులు నీతో మాట్లాడేది లేదని చెబుతాడు. ఆ తరువాత ప్రియాంక యావర్ ను, శివాజీని నామినేట్ చేసింది. యావర్ ను నామినేట్ చేస్తూ.. కెప్టెన్ గా నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తే.. నువ్వు కెప్టెన్ కాదు అని అన్నావు అది నాకు నచ్చలేదు అంటూ రీజన్ చెబుతుంది. శివాజీని నామినేట్ చేస్తూ రాజమాతలు టాస్క్ లో మేము చేసింది కరెక్ట్ కాదు అని అన్నారు.. అసలు మేము ఏం మాట్లాడుకున్నామో తెలుసా అంటూ రీజన్ చెబుతుంది. ఇక శివాజీ, ప్రియాంక కాసేపు వాదించుకుంటారు. శోభాశెట్టి వచ్చి శివాజీ యావర్ ను నామినేట్ చేస్తుంది.
అలా ఈ వారం శివాజీ, అర్జున్, రతిక, గౌతమ్, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, అశ్విని నానినేషన్స్ లోకి వచ్చారు. మరి వీరిలో ఎవరు ఈవారం ఇంటికి వెళతారో చాడాలి.
ఇక నామినేషన్స్ ప్రక్రియ అనంతం హౌస్ మేట్స్ అందరూ చర్చలు మొదలుపెట్టారు. ముందు కొన్ని వారాల పాటు శివాజీ గారి తప్పులను ఎవరూ చెప్పలేదు.. ఇప్పుడు చెబుతుంటే ఆయనకు నచ్చట్లేదు అందుకే అలా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు. మరోవైపు ప్రియాంక నామినేషన్ ను తీసుకోలేకపోయిన
శివాజీ యావర్, ప్రశాంత్ దగ్గర అదే చర్చిస్తాడు. గేమ్ ఆడటానికి వచ్చినా ఒక క్యారెక్టర్ ఉండాలి కదా.. గేమ్, స్ట్రాటజీ, నేను ఇలానే ఉంటా అంటే ఎలా క్యారెక్టర్ ఉండాలి కదా అంటూ కోపం వ్యక్తం చేశాడు.
ఆ తరువాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం మరోసారి గేమ్ పెడతాడు బిగ్ బాస్. ఈసారి కూడా బ్యా లెన్స్ గేమ్ పెడతాడు. ఇక ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ అందరూ పాల్గొనగా ఫైనల్ గా రైతుబిడ్డ ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను గెలుచుకుంటాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























