కార్తీ జపాన్ సెన్సార్ కంప్లీట్

karthi japan movie completes censor formalities

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ.. విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈసినిమా దీపావళి పండుగకు నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా కార్తీ మేకోవర్ ఇంకా వాయిస్ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈసినిమాసెన్సార్ కార్యక్రమాలను సైతం ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తుండగా.. సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =