అనిల్ రావిపూడి -బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి.టైటిల్ దగ్గర్నుండి టీజర్ ,సాంగ్స్ ఇలా ఏ విషయంలో డిస్పాయింట్ చేయకుండా సినిమాపై అంచనాలు పెంచారు.ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ తో పక్కా బ్లాక్ బాస్టర్ అని చెప్పే ప్రయత్నం చేశారు.నిన్నరాత్రి విడుదలైన ఈట్రైలర్ కు ఫ్యాన్స్ దగ్గరుండి మాత్రమే కాదు మిగతా ప్రేక్షకులనుండి కూడా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ట్రైలర్ అద్భుతంగా కట్ చేశారని బాలయ్య లుక్,డైలాగ్స్ సూపర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చాలా పాజిటివ్ గా చెప్తున్నారు.అనిల్ రావిపూడి అనవసరైన హుంగామ లేకుండా బాలయ్య ను సరికొత్తగా చూపెట్టనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూ ట్యూబ్ లో ఇప్పటివరకు భగవంత్ కేసరి ట్రైలర్ మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఓవరాల్ గా సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు బాలయ్యకు మరో 100కోట్ల సినిమా పడ్డట్లే.ఇంతకుముందు వీర సింహారెడ్డి తో బాలకృష్ణ ఈ ఫీట్ సాధించాడు.ఆ సినిమా ఈఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.దాంతో 9నెలల గ్యాప్ తో మరో సారి బాక్సాఫీస్ మీదకు దండయాత్ర కు వస్తున్నాడు.మరి ఈసినిమా కూడా 100కోట్ల క్లబ్ లో చేరి బాలయ్య కు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.పెళ్లి తరువాత తెలుగు లో చాలా గ్యాప్ తీసుకున్నకాజల్ ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తుంది.అయితే ట్రైలర్ లో మాత్రం ఇంతకుముందు ఎంత గ్లామర్ గా వుందో అదే విధంగా కనిపించింది.ఇక సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల,బాలయ్య కూతురిగా కనిపించనుంది.వీరికి తోడు బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్ర పోషించాడు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది నిర్మించారు.ఈసినిమా అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: