నాగ చైతన్య 23లో హీరోయిన్ ను రివీల్ చేసేశారు

Sai Pallavi Plays The Heroine Role In NC 23

యువ సామ్రాట్ నాగ చైతన్య 23వ సినిమాఫై రోజు రోజుకి హైప్ పెరిగిపోతుంది.ఇప్పటికే ఈసినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో రివీల్ అయిపోయింది.వాస్తవిక సంఘటనల ఆధారంగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఓ జాలరి ప్రేమకథతో తెరక్కనుంది.ఇందులో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించనున్నాడు.ఈపాత్ర కోసం ఇటీవలే నాగ చైతన్య జాలర్ల తో ఇంటరాక్ట్ కూడా అయ్యాడు.ఇక ఇప్పుడు ఈసినిమాకు హీరోయిన్ ఎవరనేది చెప్పేశారు మేకర్స్.అందులో భాగంగా నిన్న ఫైనల్ నరేషన్ కి హీరోయిన్ వచ్చేసిందని ఆ హీరోయిన్ ఎవరనేది కూడా హింట్ ఇచ్చారు.దాంతో సాయి పల్లవిని తీసుకున్నారని కంఫర్మ్ కాగా ఈరోజు ఆపేరును అఫీషియల్ గా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్ స్టోరీ తరువాత మరోసారి నాగ చైతన్య,సాయి పల్లవి కలిసి నటించనుండడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.కార్తికేయ ఫేమ్ చందు మొండేటి డైరెక్ట్ చేయనుండగా గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తుంది.ఇక ఈసినిమా విషయంలో నాగ చైతన్య చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు.ఈసినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి అక్కినేని ఫ్యాన్స్ ను ఖుషి చేయాలనే పట్టుదలతో వున్నాడు.

ఇదిలావుంటే చాలా గ్యాప్ తరువాత సాయి పల్లవి తెలుగులో మళ్ళీ సినిమాకు సైన్ చేసింది.ఇంతకుముందు రానాతో కలిసి విరాటపర్వంలో కనిపించింది.ఇక ఇప్పుడు నాగ చైతన్య 23 ఓకే చెప్పింది.ప్రస్తుతం ఆమె చేతిలో ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే వుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + nineteen =