నటీనటులు : నవీన్ పొలిశెట్టి,అనుష్క,మురళీశర్మ
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
సంగీతం :రధాన్
దర్శకత్వం :మహేష్ బాబు పి
నిర్మాతలు : వంశీ ,ప్రమోద్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ,జాతిరత్నాలుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ కు అందరు ఫిదా అయ్యారు.ఇక దాదాపు రెండు ఏళ్ళ గ్యాప్ తరువాత నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది అదే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.ఇందులో అనుష్క హీరోయిన్ కావడం మరో ప్రత్యేకత. 5సంవత్సరాల గ్యాప్ తరువాత ఆమె నటించిన సినిమా కావడంతో తో ఫ్యాన్స్ ఈసినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు మరి ఈసినిమా ఎలావుంది.ఈసినిమాతో నవీన్ హ్యాట్రిక్ కొట్టాడా లేదో ఇప్పుడు చూద్దాం.
కథ :
అన్విత ( అనుష్క)కు రిలేషన్స్ ఫై మంచి అభిప్రాయం ఉండదు అయితే తన ఒంటరి తనాన్ని పోగొట్టుకోవడానికి ఎలాగైనా ఒక బిడ్డను కనాలనుకుంటుందిపెళ్లి కాకుండా ఎలాంటి రిలేషన్ షిప్ పెట్టుకోకుండా ఆ బిడ్డను కనాలనుకుంటుంది.ఈక్రమంలో స్టాండప్ కమెడియన్ అయిన సిద్దు (నవీన్ పోలిశెట్టి)తో పరిచయం ఏర్పడుతుంది.తన బిడ్డకు సిద్దు తండ్రిని చేయాలనుకులంటుంది.మరోవైపు అన్విత ను గాఢంగా ప్రేమిస్తాడు సిద్దు.ఒకానొక సందర్భంలో సిద్దు,అన్విత కు తన ప్రేమ గురించి చెప్తే అప్పుడు ఆమె చెప్పే సమాధానం విని షాక్ అవుతాడు. మరి ఆతరువాత ఏమైంది? ఇంతకీ అన్విత అనుకున్నది నెరవేరిందా? అనేది మిగితా కథ.
విశ్లేషణ :
ఒక సున్నితమైన కథను ఎంటర్టైనింగ్ గా చెప్పాలనుకున్నాడు దర్శకుడు ఆ ప్రయత్నంలో సక్సెస్ కూడా అయ్యాడు.ఎక్కడా హద్దు మీరకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించి ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు.ఇక సినిమాకు నవీన్ మెయిన్ పిల్లర్ గా నిలిచాడు.తన కామెడీ టైమింగ్ తో చాలా చోట్ల నవ్వించి సినిమాను హిలేరియస్ గా మార్చాడు సాధారణంగా స్టాండప్ కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం కానీ ఈసినిమాలో నవీన్ స్టాండప్ కామెడీ ఆకట్టుకుంది.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఈకామెడీ ఎక్కువగా అలరిస్తుంది అలాగే భావోద్వేగంతో కూడిన పతాక సన్నివేశాలు ఆలోచింపచేస్తాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో చేశాడు తన టైమింగ్ తో చాలా చోట్ల నవ్వించాడు.సిద్దు పాత్రను చాలా ఈజ్ తో చేశాడు. ఇలాంటి కథలు నవీన్ కు బాగా సూట్ అవుతాయి అలాగే టైమింగ్ విషయంలో తన తిరుగులేదని మరోసారి నిరూపించాడు.అలాగే అనుష్క కూడా నటన విషయంలో ఎక్కడా తగ్గ లేదు తన అనుభవాన్ని చూపించింది.సినిమాలకు గ్యాప్ ఇచ్చినా నటన విషయంలో మాత్రం తానేంటో మరోసారి నిరూపించింది, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా చేసింది.అంతేకాదు స్క్రీన్ ఫై చాలా గ్లామర్ గా కనబడింది.ఇక కీలక పాత్రల్లో కనిపించిన నాజర్, జయసుధ అభినవ్ గోమఠం తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక సినిమా ఉన్నతంగా వుంది. ఓ సున్నితమైన అంశాన్ని ఆసక్తికరమైన కథనం తో ఎంటర్టైనింగ్ గా చెప్పడం లో డైరెక్టర్ తన ప్రతిభను చూపెట్టాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్ ను డీల్ చేసిన విధానం బాగుంది.సంగీతం విషయానికి వస్తే అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతంలో వచ్చిన సాంగ్స్ మెప్పించాయి. గోపిసుందర్ బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ కథకు తగ్గట్లు వుంది.నిరవ్ షా సినిమాటోపీగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ రిచ్ గా అనిపించాయి.ఎడిటింగ్ ఓకే.యూవీ క్రియేషన్స్ క్వాలిటీ విషయంలో రాజీపడకుండా సినిమాను ఉన్నతంగా నిర్మించారు.
ఓవరాల్ గా రొమాంటింక్ ఎంటర్టైనెర్ గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లో నవీన్, అనుష్కల నటన కామెడీ ,సినిమాటోగ్రఫీ ,ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్ అయ్యాయి.యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా ఈసినిమా నచ్చుతుందనడంలో సందేహం లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: