రూ. 600 కోట్ల క్లబ్‌లో రజనీకాంత్ ‘జైలర్’ మూవీ

Superstar Rajinikanth Jailer Movie Crosses Rs.600 Cr Mark

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజై 20 రోజులు అవుతున్నా థియేటర్లలో ఇంకా దీని హవా కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో చాలా కొత్త సినిమాలు రిలీజైనా.. జైలర్‌ ముందు అవన్నీ తేలిపోతున్నాయి. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్‌ ర్యాంపేజ్‌ పాన్‌ ఇండియా లెవల్లో మరోసారి అందరికీ తెలియవచ్చింది. ముఖ్యంగా సౌత్‌లో రజినీ తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. నిజానికి జైలర్‌ కథ కన్నా.. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీకాంత్ స్క్రీన్‌ ప్రజెన్స్‌, అనిరుధ్‌ మ్యూజిక్‌ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఇక ఈ సినిమా ద్వారా రజినీ గత రికార్డులను బ్రేక్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో, తాజాగా జైలర్‌ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జైలర్‌ మూవీ రూ.600 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తద్వారా ఈ మార్క్‌ అందుకున్న రెండో తమిళ సినిమాగా నిలిచింది. దీనికన్నా ముందు రోబో 2.o రూ.600 కోట్ల మార్క్ అందుకుంది. అయితే ఇది కూడా రజినీ చిత్రమే కావడం విశేషం. దీంతో ఒకే హీరో నటించిన రెండు సినిమాలు రూ.600 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డ్ సృష్టించినట్లయింది. కాగా రోబో సీక్వెల్ ఈ రికార్డును 10 రోజుల్లో అందుకోగా.. జైలర్‌ మాత్రం 18 రోజుల్లో సాధించింది. టాలీవుడ్‌ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ డబ్బింగ్‌ సినిమాకు రాని ప్రాఫిట్స్‌ను జైలర్ సినిమా తీసుకొచ్చిందని ఇండస్ట్రీ టాక్. తెలుగులో ఈ సినిమా రూ.75 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను రాబట్టగా.. కేరళ, కర్ణాటకలో రూ.50 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. మరోవైపు ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే రూ.200 కోట్లకు పైగా షేర్‌ను కలెక్ట్ చేసి రజనీ మేనియా ఏంటో చాటి చెప్పింది.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినాయకన్, రమ్య కృష్ణన్, వసంత్ రవి మరియు తమన్నా భాటియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక జైలర్‌ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ అగ్ర నటుడు మోహన్‌ లాల్ మరియు బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ క్యామియో రోల్స్ లో కనిపించడం విశేషం. సినిమాలో వీళ్ల ఎంట్రీకి ఆడియెన్స్‌ ఈలలు, గోలలతో థియేటర్‌లు దద్దరిల్లిపోయాయి. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే సంగీతం అందించాడు. కొన్నిచోట్ల కేవలం తన బీజీఎమ్ తో గూస్‌బంప్స్‌ తెప్పించాడు. మొత్తంగా జైలర్‌తో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనే సృష్టించాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని నెల్సన్‌ చెప్పడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =