సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురురిపిస్తుంది.గత వారం విడుదలైన ఈసినిమా ఎక్స్ట్రార్డినరీ మౌత్ టాక్ తో దూసుకుపోతుంది.నిన్న హాలిడే కావడం కూడా బాగా కలిసొచ్చింది.నిన్న ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో 6రోజుల్లో ఈసినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.రోబో 2.0 తరువాత 400కోట్లకు పైగా రాబట్టడం రజినీకి ఇది రెండోసారి.జైలర్ ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి భారీ లాభాలను తీసుకొస్తుంది.డిస్ట్రిబ్యూటర్ల కు జైలర్ జాక్ పాట్ లా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా సెన్సేషన్ సృష్టిస్తుంది.నిన్న ఒక్క రోజే 10కోట్ల గ్రాస్ ను రాబట్టి షాక్ ఇచ్చింది.6రోజుల్లో జైలర్ తెలుగు,తమిళ వెర్షన్ కలిపి 49కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.
అటు తమిళనాడు లో 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.కేరళ లో 30కోట్ల గ్రాస్ ను అలాగే కర్ణాటక లో 40కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఓవరాల్ గా సౌత్ లో అంతటా జైలర్ డామినేషన్ కొనసాగుతుంది. ఈరోజుతో జైలర్, విక్రమ్ లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేయనుంది.ఫుల్ రన్ లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 కలెక్షన్స్ ను క్రాస్ చేసిన ఆశ్చర్యం లేదు .
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.సన్ పిక్చర్స్ నిర్మించింది.ఇక జైలర్ బ్లాక్ బాస్టర్ కావడంతో నెల్సన్, జైలర్ 2ను ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: