పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమా బ్రో. ఈసినిమా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనేే సినిమాకు రీమేక్ గా వస్తుంది. డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్ లో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై ఇంకా బజ్ క్రియేట్ చేస్తుంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగు భాష గురించి ఆకస్తికర కామంట్స్ చేశారు. ఈసినిమా చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో వచ్చింది. త్రివిక్రమ్ గారు నాకు ఈ సినిమా గురించి చెప్పారు. ఇక ఈసినిమా స్క్రిప్ట్ రీడింగ్ కు నేను కూడా వెళ్లాను.. అక్కడ సముద్రఖని గారు స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆయన కూడా తమిళ్ లోనో.. ఇంగ్లీష్ లోనో రాసుకొని ఉంటారనుకున్నా.. కానీ ఆయన తెలుగులో చదువుతున్నారు. అది చూసి నేను షాకయ్యాను.. అప్పుడు అడిగా మీకు తెలుగు వచ్చా అని.. దానికి ఆయన మీతో సినిమా చేస్తున్నాను కదా అందుకే ఆరు నెలల నుండి నేర్చుకుంటున్నా అని చెప్పారు. మా అందరికీ మీరు కనువిప్పు కలిగించారు.. మీరే అంత ప్రేమించి మా భాషను నేర్చుకుంటే.. మా మాతృభాషను మేమెంత గౌరవించాలి.. ఇది నాకు చెంపపెట్టులా అనిపించింది నాకు. నాకు మాత్రమే కాదు తెలుగు మాతృ భాష అయి ఉండి తెలుగు రాని ప్రతివారికి ఇది ఒక లెసన్ లాంటిది. ఈరోజు ఆయనకు మాట ఇస్తున్నా నేను తమిళ్ లో మాట్లాడగలను కానీ చదవడం కూడా నేర్చుకొని స్పీచ్ కూడాా ఇస్తానని చెబుతున్నా అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: