టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో రానా పేరు కూడా ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటినుండీ కాస్త విభిన్నమైన సినిమాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాడు రానా. ఇదిలా ఉండగా రానా హీరోగా హిరణ్యకశ్యప అనే సినిమా రానున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది అన్నారు. అయితే ఆ తరువాత ఈసినిమా ఆగిపోయింది అని కూడా అన్నారు. ఆ తరువాత ఈసినిమా ఉంటుందన్న క్లారిటీ కూడా ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా గురించి అందరూ దాదాపుమరిచిపోయారు. అలాంటి సమయంలో ఈసినిమాపై సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చి షాకిచ్చాడు రానా. అమెరికాలోని శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనేందుకు రానా కూడా అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడ ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చి పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఈసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందించనున్నాడు.
తాజాగా ఈసినిమా కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హిరణ్య కశ్యపుడి కథని కార్టూన్ రూపంలో ఉన్న వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో అనేక అంశాలు ఉన్నాయి. హిరణ్యకశ్యపతో పాటు మరో రెండు మూడు ఇతర పాత్రలను అన్నీ డ్రాయింగ్స్ రూపంలో చూపించినట్టు అర్థమవుతోంది. బ్యాక్ గ్రౌండ్ ఆకట్టుకుంటుంది. ఇక రానా కూడా తన ఇన్ట్సాలో రాక్షస రాజు ఆగమనం అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు. కాగా ఈసినిమాను రానా సొంతం బ్యానర్ స్పిరిట్ మీడియాపై ఈసినిమాను నిర్మించనున్నారు. మరి ఈసినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి..
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: