మంచి టాక్ తో దూసుకుపోతున్న ఆదిపురుష్

prabhas adipurush telugu movie gets positive response

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా ఫైనల్లీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇతిహాసం రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుండటం ప్రధాన కారణమైతే ప్రభాస్ లాంటి హీరో ఈసినిమాలో నటించడం మరో కారణం. అందుకే ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ముందు టీజర్ తో కాస్త నిరాశచెందినా కూడా ఆతరువాత రిలీజ్ అయిన ట్రైలర్లు, పోస్టర్లు, ముఖ్యంగా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆ అంచనాల మధ్య నేడు ఆదిపురుష్ రిలీజ్ అవ్వగా సినిమా మాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రామాయణం అంటే నిజానికి అందరికీ తెలిసిన కథ. కథలో మార్చడానికి ఏం లేదు. అందులోనూ రామాయణం మీద ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలిసిన కథనే మళ్లీ చూపించడం అంటే మాములు విషయం కాదు. కత్తిమీద సాము లాంటిదే. అలాంటిది ఓం రౌత్ చాలా ధైర్యంగా మళ్లీ ఈసినిమాను తీయడానికి ముందుకొచ్చాడు. అయితే 3డీలో టెక్నాలజీనీ వాడుకుంటూ విజువల్ వండర్ గా ఈసినిమాను రూపొందించాడు ఓం రౌత్.

తెలిసిన కథ అవ్వడం వల్ల స్టోరీలో నెక్ట్స్ ఏ జరుగుతుందో అని ముందే తెలుసు కాబట్టి ఓ రౌత్ కూాడా
ఎక్కడా కథను సాగదీసే ప్రయత్నం చేయలేదు. తెరపై కథ చకచకా జరిగిపోతూ ఉంటుంది. ఒక సన్నివేశం చివరిలో మరో సన్నివేశం కలిసిపోతూ ముందుకు వెళుతుంది. ఇక ఈసినిమాలో రామునిగా నటించిన ప్రభాస్ సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఇంకా ప్రభాస్-కృతీ సనన్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటుంది. ఇంకా రావణునిగా సైఫ్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ మిగిలిన వారు ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. జటాయువు రావణుడిని వెంబడించడం .. రాముడు సముద్రుడిపై బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టడం .. హనుమంతుడి లంకా దహనం .. వారధి నిర్మాణం .. రావణుడి కోటను వానరవీరులు ముట్టడించడం వంటి సీన్స్ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఇక త్రీడీలో ఈసినిమా చూడటం మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. గ్రాఫిక్స్ తో పాటు అందుకు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉండటంతో ప్రతి సన్నివేశం చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. మరి తెలిసిన కథే అయినా మరోసారి విజువల్ వండర్ గా వచ్చిన ఈసినిమాను చూసి ప్రతిఒక్కరూ తప్పకుండా ఎంజాయ్ చేయాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.