నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక మరోవైపు అప్పుడప్పుడు ఈసినిమా నుండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత హైప్ ను పెంచుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో దిశా పటాని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దిశా పటాని పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కళ్లు మాత్రమే చూపిస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. నుదిటిపై బొట్లు ఉన్న దిశా ప్రీ లుక్ చూస్తుంటే ఈసినిమాలో డిఫరెంట్ రోల్ ఉండబోతుందని అర్థమవుతుంది.
Wishing @DishPatani a very Happy Birthday from team #ProjectK. pic.twitter.com/5qPFkrXyLK
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 13, 2023
కాగా ఈసినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: