నాని 30 ముంబై షెడ్యూల్ కంప్లీట్

nani 30 movie team wraps up mumbai schedule

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నాని30 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దసరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత నాని నుండి వస్తున్న సినిమా.. మరోవైపు సీతారామం లాంటి క్లాసిక్ హిట్ తరువాత మృణాల్ ఠాకూర్ చేస్తున్నసినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమాలో కూడా నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడు. 6ఏళ్ల కూతురికి తండ్రిగా ఈసినిమాలో నటించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. గతంలో గోవాలో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ అనంతరం ముంబైలో మరో షెడ్యూల్ ను మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో తన ముంబై షెడ్యూల్ పూర్తయిందని మృణాల్ ఠాకూర్ తెలుపుతూ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. ముంబై షెడ్యూల్ పూర్తయింది.. మొదటిసారి ఒక సౌత్ ఇండియా సినిమా షూటింగ్ ను నా హోమ్ టౌన్ లో చేస్తున్నా..చాలా ఎంజాయ్ చేశాము అంటూ పోస్ట్ లో పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

కాగా ఈసినిమాను వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.వి.మోహ‌న్‌, డాక్ట‌ర్ విజేందర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 8 =