యూ ట్యూబ్ స్టార్ గా సుమంత్ ప్రభాస్ అందరికీ సుపరిచితుడే. అప్పుడే తన నటనతో యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించకోవడానికి వస్తున్నాడు. సుమంత్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా మేము ఫేమస్. కేవలం హీరోగా మాత్రమే కాదు ఈసినిమాకు డైరెక్టర్ గా ఇంకా రచయితగా కూడా సుమంత్ ప్రభాస్ పనిచేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతోో పాటు చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టే అవకాశమే ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అంతేకాదు ప్రమోషన్స్ లో టాలీవుడ్ యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, అడివి శేష్ ఇలా చాలా మంది హీరోలు సైతం సినిమాకు సపోర్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా మే 26వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా ఒక్క రోజులో ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మహేష్ చేసిన పోస్ట్ సినిమాకు మంచి క్రేజ్ ను క్రియేట్ చేసింది. ఈసినిమాను చూసిన మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. మేము ఫేమస్ సినిమాను చూశాను.. ప్రతి ఒక్కరి పెర్ఫామెన్స్ అద్భుతుంగా ఉంది.. ముఖ్యంగా రైటర్ గా, డైరెక్టర్ గా, హీరోగా సుమంత్ ప్రభాస్ వాట్ ఏ టాలెంట్.. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ ఇంకా అన్ని క్రాప్ట్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.. చాలా మంది డెబ్యూ టీం ఈసినిమాను తెరకెక్కించిందంటే నమ్మశక్యంగా లేదు.. ఇలాంటి టాలెంట్ ని వెతికి మంచి ప్రోడక్ట్ తీసినందుకు గాను నిర్మాతలు శరత్ చంద్ర మరియు అనురాగ్ రెడ్డి లకు కంగ్రాచ్యూలేషన్స్ ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.
Just watched #MemFamous! Brilliant film!! ❤️❤️
Blown away by the performances of each and every actor in the film, especially writer, director and actor @SumanthPrabha_s – what a talent!
The visuals, background score and all the crafts sit perfectly. Can’t believe a bunch of…
— Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2023
మరి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన మేము ఫేమస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.